అంబేద్కర్ జాతీయ అవార్థు గ్రహీత కడమంచి నారాయణ దాస్
చేవెళ్ల : ఏప్రిల్ 3 నంచి జరగబోయే పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులు సమయాన్ని వృధా చేయకండా ఇప్పటినుంచే కృషి, పట్టుదలతో కష్టపడి చదవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్థు గ్రహీత కడమంచి నారాయణ దాస్ అన్నారు. సోమవారం చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవల్లి, ఊరెళ్ళ, తంగడపల్లి, కౌకుంట్ల,అంతారం, ఆలూరు, ఆలూరు ఉర్దూ మీడియం, ఖానాపూర్, చేవెళ్ల, గుండాల, మల్కాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలను కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులంతా నిరుపేదలేనని చెప్పారు ఏపీజే అబ్దుల్ కలాం వంటి గొప్ప గొప్ప మహానీయులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవారేనని గుర్తు చేశారు. మహనీయుల స్ఫూర్తిగా తీసుకొని మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం సులువేనని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పేద విద్యార్థులకు తాను ఎల్లప్పుడూ సహాయ సహకారాలను అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, రాజశేఖర్, ప్రధానోపాధ్యాయులు నోవా లక్ష్మి, గోపాల్, రవీందర్, జగదీశ్వర్ రెడ్డి మల్లేష్, శంకరయ్య, వెంకటయ్య, భూపాల్ రెడ్డి, శ్రీలత, సుభాష్, చంద్రబోస్ రెడ్డి, మహమ్మదీబేగం గుండాల ఎస్ఎంసి చైర్మన్ యాదయ్య,ఆలూరు సర్పంచ్ విజయలక్ష్మి నర్సింలు, న్యాయవాది నర్సింలు, తూర్పాటి సురేష్, ఉపాధ్యాయులు రాజు, అక్బర్, ప్రకాష్ రెడ్డి,శ్రీశైలం, కృష్ణ ప్రకాష్ రెడ్డి, చాముండేశ్వరి, నర్మదా, భాగ్యలక్ష్మి, శ్రీలత, లాలయ్య, దేవుని ఎర్రవల్లికి చెందిన బోడపోతుల జంగయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.