స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
- మెదక్ జిల్లాలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షిల్ పాఠశాలలు
- ప్రభుత్వ నిధులు, ఎంఎస్ఎస్ఓ నిధులతో ప్రత్యేక అభివృద్ధికి త్వరలోనే శ్రీకారం
- కొంటూర్ చెరువు ప్రాంతంలో మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తా
- పోచారం మెదక్ ఖిల్లా ఏడుపాయల ను టూరిజంగా ఏర్పాటు
- వంద ఫీట్ల ఎత్తుతో ఏసయ్య అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తా
- మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చుతానని ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అభివృద్ధిలో మెదక్ జిల్లా ను అగ్రబాగాన ఉండేలా ప్రణాళికను సిద్ధం చేసాను మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ స్పష్టం చేశారు. మెదక్ నియోజక వర్గంలోని మెదక్ ఖిల్లా చర్చి పోచారం అభయారణ్యం ఏడుపాయల ను ప్రత్యేక నిధులతో ప్రత్యేకత చాటుకునేలా అభివృద్ధి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఖండాతరఖ్యాతి గాంఛిన చర్చిలో పెద్ద ఏసు విగ్రహం ఏర్పాటే లక్ష్యం…
ప్రపంచఖ్యాతి గాంఛిన మెదక్ కెతిడ్రల్ చర్చి దేశానికే తలమానికం అని నియోజక వర్గానికి హైలెట్ గా నిలిచిందని కరువున్న సీమలో కరుణామయుడుగా చర్చి అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తానని చర్చి విషయం ప్రస్థావించిన విలేకరులతో ఆయన మాట్లాడారు. దాదాపు యాభై నుంచి వంద ఫీట్ల ఎత్తున్న ఏసు విగ్రహాని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు.
మెదక్ లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం….
మెదక్ పట్టణంలో మిగతా విగ్రహాల కన్న అంబేద్కర్ విగ్రహం చిన్నగా ఉందని… అలా కాకుండా జిల్లాలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. పేరుకే మెదక్ కాని పదేండ్లలో స్పష్టమైన అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శించారు.
కొంటూర్ చెరువు పై మహానీయుల విగ్రాహాల ఏర్పాటు.మెదక్–చేగుంట రహదారి పై ఉన్న కొంటూర్ చెరువు ఆహ్లాదకరంగా ఉండేలా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. హైద్రాబాద్ ప్రధాన రహదారి కాబట్టి ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేసి మహానీయుల విగ్రహాలతో పాటు మెదక్ ప్రజలకు పెన్నిదిగా నిలిచిన కేవల్ కిషన్ విగ్రహంతో పాటు ప్రజల అభ్యర్థన మేరకు ఆయా విగ్రహాలను ఏర్పాటు చేద్దామని ఆయన హామినిచ్చారు.పోచారం అభయారణ్యంతో పాటు పోచారం డ్యాంను అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.మెదక్ ఖిల్లా అభివృద్ధికి కూడా నిధులు తెస్తానని తెలిపారు. ఏడుపాయల దేవస్థానం అభివృద్ధిని కనివినీ ఎరుగని రీతిలో ఈ ఐదేండ్ల పాలనలో చేస్తానని తెలిపారు.అలాగే మెదక్ పట్టణంలోని మిని ట్యాంక్ బండ్ ల సుందరీకరణ పనులు పూర్తి చేస్తానని ఆయన హామినిచ్చారు.మెదక్ చౌరస్తాల విషయంలో కొంత ఆలస్యం జరిగినా ప్రత్యేక నిధులతో చౌరస్తాల అభివృద్ధి తో పాటు వెల్ కం మెదక్ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి మెదక్ పట్టణం నోచుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ర్టంలోనే మెదక్ నియోజక వర్గం హైలెట్ గా నిలిచేలాగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
మెదక్ నుండి తరలిపోయిన అన్ని కార్యాలయాలను ఎన్నికల్లో హామిలో భాగంగా మెదక్ కు రప్పిస్తానని ఆయన అన్నారు.అందులో భాగంగా యుద్ధప్రాతిపదికన కన్సర్ వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ అండ్ కెమిస్ర్టి ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళామని ఆయా మంత్రులకు కూడా లేఖలు పంపించానని అవి త్వరలోనే మీడియా సమక్షంలో తెలుపుతానని ఆయన అన్నారు. తరలిన జింకలను కూడా తీసుకువస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే తరలి పోయిన పి.జి. కళాశాలను ఏర్పాటు చేస్తానని ఆయన హామినిచ్చారు. వైద్య విషయంలో మెదక్ కు మెడికల్ కళాశాలను రప్పించడంలో క్రీయాశీల పాత్ర పోషించానని జిల్లా ఔషద గిడ్డంగి కేంద్రం ను కూడా మెదక్ కు తీసుకువచ్చానని గతంలో సంగారెడ్డికి వెళ్ళి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.కూచన్ పల్లి లో ఎస్.సి.సి.సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా.కూచన్ పల్లి విద్యార్థులు తల్లిదండ్రుల కోరిక మేరకు ఎస్.ఎస్.సి. సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని గ్రామస్థులకు హామినిచ్చారు. వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా పంట చేతికి రాకముందే ప్రతి గింజను కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.త్వరలోనే మెదక్ జిల్లాకు రెసిడెన్షియల్ పాఠశాలలు మెదక్ జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను తీసుకురానున్నట్లు మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. ఇట్టి విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళానని లేఖను కూడా అందజేశానని ఆయన అన్నారు.వచ్చే విద్యాసంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కానున్నట్లు పేర్కోన్నారు.