ప్రజల గుమ్మం వద్దకు న్యాయ సేవను తీసుకెళ్లాలి – జస్టిస్ విజయసేనక్ రెడ్డి

స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా

పేదవాళ్లకు సత్వర న్యాయం జరిగే దిశగా చర్యలు
కొత్త చట్టాలు తీసుకురావడం ప్రజలకు చాలా మంచిది.
మెదక్ జిల్లా న్యాయస్థానాల
*పనితీరు బేస్ హై కోర్ట్ జడ్జి
అత్యున్నత న్యాయ సేవలు అందించడంలో మెదక్ జిల్లా జడ్జి : గౌ; లక్మి శారద, పనితీరు అందరికీ ఆదర్శం
జీవితంలో పైకి రావాలంటే కక్షలు కార్పన్యాలతో కాకుండా ప్రశాంతమైన జీవితం ప్రజలు అలవాటు చేసుకోవాలి
మెదక్ జిల్లా పర్యటన ఎంతో సంతృప్తినిచ్చింది హైకోర్టు జడ్జి శ గౌ: జస్టిస్ విజయ్ సేనా రెడ్డి
మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం హైకోర్టు జడ్జి గౌ: జస్టిస్ విజయ సేనా రెడ్డి
నూతన కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం
ఘనంగా స్వాగతం పలికిన-జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ ఉదయ్ కుమార్, న్యాయమూర్తి రీటా లాల్ చంద్
హైకోర్టు జడ్జి విజయసాయి రెడ్డి వారికిజిల్లా జడ్జి శ్రీ: గౌ; లక్మి శారద,, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ శాలువాలు మెమొంటోలతో సత్కరించారు.

మెదక్ జిల్లాలో అల్లాదుర్గం మండల కేంద్రంలో నూతన సివిల్ కోర్టును ప్రారంభోత్సవానికి,మెదక్ జిల్లా జడ్జి శ్రీ: గౌ; లక్మి శారద, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , ఎస్పీ ఉదయ్ కుమార్ సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి విజయ సేనా రెడ్డి అర్చకులు వేదమంత్రాలతో వరి వట్టం కట్టి పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రాలతో ఘనంగా ఆశీర్వదించారు. కోర్ట్ కాంప్లెక్స్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం
శిలాఫలకం ఆవిష్కరించారు. కోర్టు కాంప్లెక్స్ లో అర్చకులు నిర్వహించిన పూజా కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి. పాల్గొన్నారు. అనంతరం
రీటా లాల్ చంద్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
నూతన కోర్టు కాంప్లెక్స్ లో హైకోర్టు న్యాయమూర్తి విజయసేనా రెడ్డి ఆధ్వర్యంలో
రీ టా లాల్ చంద్ న్యాయమూర్తిగా కోర్టు నిర్వహించారు.
తదుపరి మెదక్ జిల్లా జడ్జి: గౌ; లక్మి శారద సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని
హైకోర్టు జడ్జి విజయసేనా రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఈ ప్రాంత వాసులకు సత్వర న్యాయం అందించే దిశగా న్యాయస్థానం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ప్రాంత వాసులకు శుభదినమైన రోజు అని అన్నారు
జీవితంలో పైకి రావాలంటే కక్షలు కార్పన్యాలతో రగిలిపోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణం అలవర్చుకోవాలని హితవు పలికారు.మెదక్ జిల్లా శంకరంపేట మండలం మా నాయనమ్మ తాతయ్య, ఈ ప్రాంత వాసులుగా నేను ఈ ప్రాంత వాసినే
మెదక్ జిల్లా అనుబంధం చాలా గొప్పదని గర్వంగా చెప్పారు.
నూతన సివిల్ కోర్టును ప్రారంభించుకోవడం వల్ల రేగోడు, శంకరంపేట్, అల్లాదుర్ ఈ ప్రాంత వాసులకు, పేద ప్రజలకు సత్వర న్యాయం దొరుకుతుందని అన్నారు. కొత్త చట్టాలు రావడం ప్రజలకు చాలా మంచిదని వివరించారు.

సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం మెయింటెనెన్స్ కేసులు త్వరగా పరిష్కారం చేయాలని. చైల్డ్ కస్టడీ విడాకులు క్రిమినల్ సంబంధించిన కేసులు ప్రాధాన్యత క్రమంలో
పరిష్కరించాలన్నారు. ఈరోజు చాలా సంతోషం కరమైన రోజు నా జీవితంలో మరిచిపోను రోజుగా గుర్తుంటుంది అన్నారు
మార్పుతోనే సమాజం ముందుకు పోతుందని చట్టాలు పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని సివిల్ కేసులు పరిష్కరించే విషయంలో లాయర్లు నిర్భయంగా చట్టంలోని నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రజాస్వామ్యం ఉన్న రోజులు వివాదాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయని
తద్వారా కేసులు నమోదు అయినప్పుడు లాయర్లు ఉంటారు పరిష్కారానికి కోర్టులు కూడా ఉంటాయన్నారు. జిల్లాలో లీగల్ సర్వీస్ అథారిటీ విజయపథంలో ముందుకు పోతుందని తెలిపారు.

అనంతరం మెదక్, నర్సాపూర్, జోగిపేట సంగారెడ్డి నారాయణఖేడ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెమొంటోలు శాలువాలతో హైకోర్టు జడ్జి విజయసేనా రెడ్డి ఘనంగా సత్కరించారు

ఈ కార్యక్రమంలో మెదక్ జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్ నర్సాపూర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనిత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీపతిరావు న్యాయవాదులు ప్రతాపరెడ్డి జనార్దన్ రెడ్డి బాలయ్య శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ చిరంజీవి రవి గౌడ్ జిల్లా పాలన యంత్రాంగం బార్ అసోసియేషన్ ప్రతినిధులు పోలీస్ రెవిన్యూ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!