రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.. సున్నపు ప్రవీణ్
చేవెళ్లలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దళితరత్న అవార్డు గ్రహీత బురాన్ ప్రభాకర్, చేవెళ్ల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సున్నపు ప్రవీణ్, సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మన స్వతంత్ర భారత దేశంలో అన్ని వర్గాలు స్వేచ్ఛాయుతంగా జీవిస్తున్నారంటే అందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే కారణమన్నారు. పేద ప్రజల హక్కులను పరిరక్షించడంలో రాజ్యాంగం ముఖ్య పాత్ర పోసిస్తుందన్నారు. పేద, ధనిక, కులాలు అనే తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాద్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం కోశాధికారి బురాన్ నరేష్, సంఘం సభ్యులు తలారి శ్రీనివాస్, బ్యాగరి ప్రవీణ్, బబ్ల్యూ, నరేందర్ తదితరులు ఉన్నారు.