ఎమ్మెల్యే యాదన్న.. రోడ్డు వేసేది ఇంకెన్నడన్నా

వికారాబాద్ జిల్లా : నవాబ్‌పేట్‌ నుండి మైసమ్మ గడ్డ వరకు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను వెంటనే వేయించాలని నవాబ్‌పేట్‌ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు పనులు ప్రారంభించి సంవత్సరంనర గడిచినా ఎంతోమంది ప్రమాదాలకు గురైనా… గాయాలపాలైన, రోడ్డుమీద విపరీతమైన దుమ్ముతో ఎందరో అస్వస్థతకు గురైన పట్టించుకునే నాధుడు కానీ, ప్రభుత్వం కానీ లేదని! ఎమ్మెల్యే కాలే యాదయ్యను, కాంట్రాక్టర్లను నిలదీస్తూ? రాస్తారోఖో చేశారు. దీనికి సామాన్య ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా సానుకూలంగా స్పందించి పూర్తి మద్దతు ఇచ్చి సహకరించారు. ప్రజలను ఉద్ధరిస్తాను అభివృద్ధి చేస్తానని పార్టీలు మారి ఇంటి అందరికి పదవులు ఇప్పించుకొని విలాసవంతమైన జీవితాలు గడుపుకొని సొమ్ములు కూడగట్టుకుంటున్నాడు కానీ ప్రజలకు తాను చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. అక్రమంగా బిజెపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!