ప్రియురాలిని ముక్కలుగా నరికిన ప్రియుడుని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు
యూపీ : వేరొకరిని పెళ్లి చేసుకున్నందుకు మాజీ ప్రియురాలని ప్రియుడు 6 ముక్కలు చేసాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా అతన్ని ఆదివారం నాడు ఆధారాలును కనుగొనడానికి ఒక ప్రదేశానికి తీసుకెళ్లగా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అతన్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కాగా నిందితుడు ఘటనా స్థలంలో పిస్టల్ ను దాచి ఉంచి తమపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.