హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు కేటీఆర్‌కు వారు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. జనాల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఇన్నర్ వేర్ బ్రాండ్ జాకీ(పేజ్ ఇండస్ట్రీస్) ఇబ్రహీంపట్నం, ములుగులో గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతుందని కేటీఆర్ తెలిపారు. ఒక కోటి బట్టలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. దీంతో 7 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా జాకీ కంపెనీని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు..