అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట ఏపిఎండిసి బ్రాంచ్ అవుట్ సోర్స్ ట్రైనీ కార్మికులు జేఏసీ, ఆధ్వర్యంలో నెల రోజుల క్రితం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, డెసిగ్నేషన్ పని హోదా బట్టి, వేతనం ఇవ్వాలని, సమ్మె నోటీసు ఇచ్చిన విషయం విధితమే, ఈనెల17 నుంచి ఆందోళన చేస్తామని హెచ్చరించిన విషయం గుర్తు చేశారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఏ ఎల్ సి, జేఏసీ నాయకులను, 16వ తేదీ బుధవారం హైదరాబాదులో చర్చలకు ఆహ్వానించారు. ఏపీఎండిసి యాజమాన్యం నుండి, ఎండి ఆతరేషన్ తో, జనరల్ మేనేజర్, సుదర్శన్ రెడ్డి, హెచ్ఆర్ సెక్షన్ నుండి జనరల్ మేనేజర్ కళావతమ్మ, హాజరయ్యారు. ఏపీ ఎం డిసీ, పోరాట కమిటీ,జేఏసీ నుండి కన్వీనర్, ఆర్ వెంకటేష్, వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు , సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు డిఆర్ర్ .శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, బండారు భాస్కర్. పెంచలయ్య, ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం, గౌరవ అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్, అధ్యక్షులు కుప్పాల. సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి నారదాసు సుబ్బరాయుడు, కోశాధికారి, మావిళ్ళ చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్, జి .వెంకటేష్, జేఏసీ లీగల్ అడ్వైజర్ , దీప్తి,కోశాధికారి, ఈశ్వరయ్య, అడ్వైజర్ సిహెచ్ శంకరయ్య. తదితరులు పాల్గొన్నారు. ఏ ఎల్ సి దగ్గర జరిగిన చర్చలు వివరాలను, 17వ తేదీ గురువారం ఏపీఎండిసి మంగంపేట ఆఫీస్ వద్ద 11 గంటలకు, జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. జేఏసీ నాయకులు మాట్లాడతారు, భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు. ఉద్యోగి కార్మికులు, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
అభినందనలతో,
సిహెచ్. చంద్రశేఖర్, గౌరవాధ్యక్షులు.
ఏపీఎండిసీ, ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు.