నాణ్యత లోపించిన సిసి రోడ్డు: మున్సిపల్ చైర్మన్ దేవన్న
అయిజ: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో నిర్మాణ సిసి రోడ్డు నిర్మాణంలో నాణ్యతను పాటించడం లేదని అయిజ మున్సిపల్ చైర్మన్ దేవన్న. బుధవారం ఉదయం నేరుగా సిసి రోడ్డు దగ్గరకు వెళ్లి ఆయన పరిశీలించారు. 8 ఇంచులు ఉండేలా సిసి రోడ్డు నిర్మించాలని, అలాంటి నిబంధనలు పాటించలేదని ఆయన చెప్పారు. రాత్రిళ్లు రోడ్డు పనులు కొనసాగుతుండడంతో నాణ్యతను పాటించడం లేదు. సంఘటన స్థలం నుంచి ఏఈ గోపాల్ కు ఫోన్ చేసి మాట్లాడారు. నిర్మాణాన్ని పగటి పూట కొనసాగేలా చూడాలని ఏఈ తో చెప్పారు.