ఇటుకల బట్టీల్లో పనిచేస్తామని 4.60 లక్షలు స్వాహా.. ముగ్గురిపై కేసు:ఎస్సై శ్రీనివాస్
బేతంచర్ల: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలకు చెందిన ముగ్గురు పై చీటింగ్ కేసు నమోదు చేసి బేతంచర్ల ఎస్సై శ్రీనివాస్ బుధవారం తెలిపారు. గద్వాలకు చెందిన శాస్త్రి, దేవరాజు, రాజానందం లు కలిసి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన రామకృష్ణ వద్ద ఇటికలబట్టిలో పనిచేస్తున్నామని, నమ్మించి అతని దగ్గర 4, 60, 000 రూపాయలు తీసుకున్నారు. తన దగ్గర ఇటుకల పని చేయకుండా మోసం చేసినట్లు బాధితుడు రామకృష్ణ బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.