స్నేహమంటే ఇదేరా
◆అకాలమరణం చెందిన మిత్రుడి కుటుంబానికి చేయూత
◆మేమున్నాం అంటూ ముందుకొచ్చిన మిత్రులు
◆మిత్రుడి కుటుంబానికి ఆర్ధిక సాయం
◆హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
సూర్యాపేట జిల్లా: స్నేహం అంటే కేవలం బ్రతికున్నప్పుడు కలసి పార్టీల పేరుతో పబ్ ల్లో, క్లబ్ ల్లో కలిసేది కాదని, కలిసున్నా,కాలం చేసినా స్నేహం విలువ తగ్గదని నిరూపించారు సూర్యాపేట జిల్లాలో కొందరు నిజమైన స్నేహితులు. వివరాల్లోకి వెళితే… చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన ఆర్.వీరప్రసాద్ (35) ఇటీవల గుండె పోటుతో మృతి చెందాడు. మిత్రుడి మరణవార్త తెలుసుకున్న ప్రసాద్ బి.ఎడ్.క్లాస్ మెంట్స్ తమ స్నేహితుడి అండగా ఉండాలని భావించారు. కలిసి తిరిగిన జ్ఞాపకాలను నెమరవేసుకొని దుఃఖించారు.తమ స్నేహితుని కుటుంబం కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండలేక అతని కుటుంబానికి శక్తి మేరకు ఆర్థిక సహాయం అందించాలని ముందుకొచ్చారు. ప్రసాద్ కుటుంబానికి రూ. 28,000/- ఆర్థిక సహాయం అందించి మేము ఉన్నామనే ధైర్యం కల్పించారు. మృతునికు భార్య, ఒక పాప,బాబు ఉండడంతో ఆ పిల్లల చదువుకు కూడా కావాల్సిన సహాయం అందిస్తామనే భోరోసా ఇచ్చారు.నిజమైన స్నేహం ఇదేరా అంటున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు.ఈ కార్యక్రమంలో మృతుడు వీరప్రసాద్ బి.ఎడ్ మిత్రులు పులి లక్ష్మణ్, చందపాక నాగరాజు, కాసాని నాగరాజులు ఉన్నారు.