స్పందించిన గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం ఏడో వార్డు పిల్లిగుండ్ల హనుమాన్ కాలనీ లో రైల్వే గేట్ నుండి హనుమాన్ గుడి వరకు రోడ్డు విషయం గురించి కాలనీ ప్రజలు గద్వాల మున్సిపల్ చైర్మన్ బి.ఎస్. కేశవ్ గారిని కలవడం జరిగింది. ఆయనకు వినతి పత్రం అందజేశారు. పిలిగుండ్ల హనుమాన్ కాలనీ నుండి గద్వాలకు రావాలంటే రోడ్డు మార్గం సరిగ్గా లేక బురద గుంట గా చిన్న జలపాతంగా తయారైంది. రోడ్డు మరమ్మత్తులు చేయగలరని చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజనీర్లు పిలిపించి వెంటనే స్పాట్ కు వెళ్లి రోడ్డును పరిశీలించి మరమ్మత్తులు చేయగలరని ఆదేశాలు ఇచ్చారు. పిల్లి గుండ్ల హనుమాన్ కాలనీ ప్రజలు మున్సిపల్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఈ .సుదర్శన్ గౌడ్. అక్కల మోహన్ .నీలి శివరాములు. కుమ్మరి అంజి . నీలి తిరుమలేష్. ఎం. నరసింహ. కొంగరి పవన్ .కుమ్మరి బడే సాబ్. టీ సాయిబాబా. టీ లింగన్న తదితరులు పాల్గొన్నారు.