వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్య వాలింటిర్ నియమించిన మున్సిపల్ ఛైర్మన్ కరుణ సూరి
వడ్డేపల్లి: తల్లితండ్రుల మరియు ఉపాధ్యాయుల కోరిక మేరకు విద్య ప్రాముఖ్యత తెలిసిన మున్సిపల్ చైర్మన్ కరుణ సూరి గారు విద్యార్థులకు నాణ్యమయిన విద్యను అందించాలని సంకల్పంతో ఒక అర్హత కలిగిన విద్య వాలంటీర్ ను తన స్వయం ఖర్చులతో నియమించి, విద్య దాన కర్తగా నిరూపించుకున్నారు.. బావి తారల భారతదేశం విద్య అనే ఆయుధం మీదనే ఆధారపడి ఉన్న విషయం ప్రస్తావించారు, అలాగే పిల్లలకు స్నేహా సంబంధాలతో మంచి విద్యను ఇవ్వాలసిందిగా ఉపాధ్యాయులకు విన్నవించారు. బుదవారం రోజున పాఠశాలను సందర్శించి నియమించిన విద్య వాలంటిరుకు నెల జీతం అందించారు. అలాగే పాఠశాల ఉన్న సమస్యలు ప్రధా నపోద్యాయుడు నరసింహ అచారీ ప్రస్తావించగా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు… ఈ కార్యక్రమంలో తెరాసా మున్సిపాల్టీ టౌన్ అధ్యక్షుడు సూరి యాదవ్ , కౌన్సిలర్ లలితమ్మ . క్రాంతి దళ్ నాయకులు నాగేష్ యాదవ్, గౌని0టి వీరేష్ , ప్రజలు మరియు ఉపాధ్యాయులు కిసాన్ సింగ్ మరియు అనురాధ పాల్గొన్నారు.