TSRTC బస్సు ఫ్రీ పాసులను విద్యార్తినులకు అందజేసిన బండ్ల జ్యోతమ్మ
ధరూర్: ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి సతీమణి బూరెడిపల్లి సర్పంచ్ శ్రీమతి బండ్ల జ్యోత్తమ్మ గారు దూర ప్రాంత గ్రామాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థినులకు ఉచిత బస్సు పాసులను అందజేశారు. సర్పంచ్ గారు మాట్లాడుతూ .. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అన్న సామెతను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆడపిల్లలు చదువుకు దూరం కాకుండా ఉచిత బస్సు పాసులను అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా సంక్షేమ పథకాలను నిర్వహిస్తోందని అందులో భాగంగానే బాలికల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా రెసిడెన్షల్ స్కూల్స్ అందుబాటులో లేని విద్యార్థులను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో ఉచిత బస్సు పాసులను ఇచ్చి స్కూల్స్ కు పంపేవిదంగా చూస్తున్నారు. ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని కిషోర బాలికలకు పౌష్టికహారం, షీ టీమ్, బాలికలకు రెసిడెన్సీ స్కూల్స్, ఆరోగ్య లక్ష్మి లాంటి అనేక పథకాలను బాలికల కోసం తేవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజుమున్నిసా బేగం, జడ్పీటీసి పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ధరూర్ సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ శివలీల, తెరాస పార్టీ మండల అధ్యక్షులు DR విజయ్, RTC డిపో మేనేజర్ సంపత్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.