కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ బృందం
హైదరాబాద్ : ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ బృందం కలిసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా తీర్మానం చేసిన కాపీని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు అందజేశారు. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ సర్వ సభ్యసమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ జాతీయ పార్టీగా మార్చే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. తీర్మాన పత్రంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. తీర్మానం ప్రతిని సీఎం కేసీఆర్ చదవి.. సభ్యుల ఆమోదం పొందారు. పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఎన్నికల సంఘానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ లేఖ రాశారు. ఈ లేఖను ఇవాళ ఉదయం ఢిల్లీలో ఎన్నిక సంఘానికి వినోద్ కుమార్, ఎం. శ్రీనివాస్ అందజేశారు