ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్06, మహానంది:

మహానంది మండలం మేజర్ గ్రామపంచాయతీ గాజులపల్లి గ్రామంలోని కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలందరూ జాగ్రత్తగా,అప్రమత్తంగా ఉండాలని వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని ఆయన అన్నారు.రైతులు వ్యవసాయ మోటార్, కరెంట్ స్తంభాలు వర్షాల కారణంగా తడచి షాక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు ముట్టుకోకూడదని, అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉతికిన బట్టలు అరవేసేటప్పుడు ఇనుప తీగలకు లోహపు తీగలకు బట్టలు ఆరవెయ్యకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు.వర్షాలు కారణంగా షార్ట్ సర్క్యూట్ వచ్చే ప్రమాదం ఉంది కావున మహిళలు అందరూ జాగ్రత్త ఉండలన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరూ వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని కొండా మధుసూదన్ రెడ్డి సూచించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!