తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి చక్రస్నానంకు భారీగా తరలి వచ్చిన భక్తులు

*ఘనంగా ముగిసిన శ్రీ కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు..!*

* చక్రస్నానంకు భారీగా తరలి వచ్చిన భక్తులు

* ద్వజావరోహణంతో ముగిసిన ఉత్సవాలు

తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చివ‌రి రోజైన బుధ‌వారం ఉదయం 7 గంటల నుంచి చ‌క్ర‌స్నానం ఘ‌ట్టం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కంక‌ణ‌భ‌ట్టార్ గిరిధర్ భట్టాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం చ‌క్ర‌స్నానం జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

*ధ్వజావరోహణంతో ముగిసిన ఉత్సవాలు*

బుధవారం సాయంత్రం 5.30 నుండి 7 గంట‌ల‌ మధ్యన జరిగిన ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసాయి. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!