జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని, నవాబ్ పేట గ్రామంలో దసరా పండగ సంధర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొని తదనంతరం మూడో విడత చేయూత నమూనా చెక్కులను మహిళలకు అందచేసారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి యేడాది ఏదో రూపంలో ఆడపడుచులకు పండుగ సాయం చేస్తున్న జగనన్న ప్రతి ఆడపడుచు గుండెల్లో సోదరుడు గా నిలిచిపోయారు అని, ఊరువాడ పండుగ వాతావరణం లో ఈరోజు చేయూత సంబరాలు జరుపుకుంటున్నారు అని, సామాన్య మహిళలకు ఆర్థిక చేయూత అందించి వారిని వివిధ రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం ఇవ్వడమే చేయూత లక్ష్యం అని, ఇప్పటికే కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఏ ఒక్క పధకం ఆగిపోకుండా ఎటువంటి దళారులు లేకుండా నేరుగా అక్కచెళ్ళమ్మల ఎకౌంటు లోకి మూడు విడతల సొమ్ము జమ చేయడం జరిగింది అని,దేశ చరిత్రలోనే మహిళా సోదరిమణులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని, గతంలో ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు నాయుడు కేవలం ఓటు బ్యాంకు గానే మహిళా సోదరిమణులను పరిగణలోకి తీసుకున్నారు అని, కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి,చేయూత, కాపు నేస్తం, విద్య దివ్వేన ఇలా ప్రతి పధకాన్ని నేరుగా తల్లి ఎకౌంటు లోకి జమ చేయడం జరుగుతుంది అని, ఈ ప్రభుత్వం మనది అని మన ప్రభుత్వం లో ప్రతి ఒక్క వర్గానికి సమపాళ్ళలో న్యాయం జరుగుతుంది అని, ఈ మూడో విడత చేయూత లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4949.44 కోట్ల విడుదల చేశారు అని దీని ద్వారా 26,39,703 మంది మహిళలకు లబ్ధి చేకూరితే మన నియోజకవర్గానికి సంబంధించి రూ.25.96 కోట్ల రూపాయలు మంజూరు అయితే దీని ద్వారా 13,859 మంది మహిళలకు ఆర్థిక సహాయం పొందారు అని, ఇది ఇలా కేవలం నవాబు పేట గ్రామానికే చేయూత పధకం ద్వారా రూ.55,50000 మంజూరు అయితే దీని ద్వారా 296 మంది అక్కచెళ్ళమ్మల కు లబ్ధి చేకూరింది అని, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా కేవలం బటన్ నొక్కి తే మీ ఎకౌంటు లో జమ జరిగాయని, కానీ చంద్రబాబు అండ్ బ్యాచ్ కి ఈవిధానం నచ్చలేదని తమ కార్యకర్తలు జన్మభూమి కమిటీ ల పేరు తో దొచుకోవడం ఇష్టమని ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నాలు వారికి నచ్చకపోవడంతో అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు అని ఏదైనా విజ్ఞులు అయిన మీకు అంత తెలుసు అని సరియైన సమయంలో మీరే వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కెడిసిసి బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు గింజుపల్లి శ్రీనివాసరావు,వేల్పుల రవికుమార్, గూడపాటి శ్రీనివాసరావు, వేల్పుల పద్మకుమారి, గింజుపల్లి మధు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.