పత్రిక ప్రకటన 01/11/2023, ధర్మపురి. ముఖ్యమంత్రి ధర్మపురి గడ్డపై అడుగు పెట్టె నైతిక అర్హత ఇప్పటికే ఎన్నో మార్లు కోల్పోయారని,ఇప్పటికయినా ధర్మపురి ప్రాంత ప్రజల చిరకాల అభిష్టాన్ని గవురవిస్తారో లేదో ముఖ్యమంత్రి తేల్చుకోవాలని రైతు రాష్ట్ర నాయకులు మరియు ఎం ల్ ఏ పరజితులు వేముల విక్రమ్ రెడ్డి అన్నారు. బుధవారం ధర్మపురి కేంద్రంలో గురువారం ముఖ్యమంత్రి ధర్మపురి పర్యటనను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అన్ని విధాలా అన్ని రకాల అవమానపరిచిన కేసిఆర్ 2001పార్టీ ఏర్పాటు మలిదశ పోరాటంలో ధర్మపురి గడ్డ పై యాగం చేసి ఆ తర్వాత అధికారాన్ని పొంది తొలి అడుగులను వెపించిన పుణితమయిన ధర్మపురి గడ్డను ఇక్కడి ప్రజల అభిష్టాన్ని పట్టించుకోకపోవడం ధవుర్భాగ్యం అని మూలాలు మరవడం సమంజసం కాదని అన్ని అర్హతలు కలిగిన ధర్మపురి ప్రాంతాన్ని డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికయినా తగు ప్రత్యేక చొరవచుపకపోతే చరిత్ర హీనులుగా మిగలక తప్పదని హెచ్చరించారు ఇప్పటికయినా మించిపోయింది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గా అధికార పార్టీ అధినేతగా గురువారం ధర్మపురి పర్యటనలో వైఖరి స్పష్టం చేస్తూ అనుకూలమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పేలా ప్రత్యేక కార్యచేరణతో ముందుకు వెళ్తామని అప్పుడు పరిస్తితులకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని హితువు పలికారు ఈ కార్యక్రమంలో మధు,సతీశ్ తదితర పలువురు పాలుగొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!