ముఖ్యంగా ఎస్సీ కాలనీవాసులు గత కొన్ని రోజుల నుండి అధికారులకు మొర పెడుతున్న పట్టించుకోని వైనం..
కలుషితమైన నీటిని తాగడంతో పలు వ్యాధుల బారిన పడుతున్న ఎస్సీ కాలనీవాసులు..
అధికారులు స్పందించి వెంటనే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు..
👉మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో త్రాగునీరు కలుషితం అవుతుంది. మినరల్ వాటర్ ప్లాంట్ల నుండి కెమికల్ కలిపిన నీటిని కొని త్రాగలేక మున్సిపాలిటీ పంపుల ద్వారా వచ్చిన మంచినీటిని మధిర ఎస్సీ కాలనీ ప్రజలు త్రాగుతున్న నేపథ్యంలో నిత్యం కలుషితంగా మున్సిపాలిటీ పంపుల వచ్చే నీటిని త్రాగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని అధికారులకు తెలియజేసిన కూడా నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్న తీరుకు విసుకు చెందుతున్న ప్రజలు..
మధిర మున్సిపాలిటీ అధికారులు కనీస ప్రమాణాలను పాటించని మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారా? ఎందుకు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో త్రాగునీరు కలుషితం అవుతుంది. పాలకమండలి లేకపోవడంతో అధికారుల ఇష్టాను రాజ్యంగా మున్సిపాలిటీలో వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు…