ఆనాడు, ఈనాడు ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీనే అని కెసిఆర్ ధ్వజమెత్తారు. 1956లో తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపింది జవహర్ లాల్ నెహ్రూ అని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే, కాంగ్రెస్ నిరంకుశంగా అణచివేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తామని చెప్పి, ఆంధ్రలో వ్యతిరేక ఉద్యమం ప్రారంభం కాగానే వెనక్కి తగ్గారని ఫైరయ్యారు. టిఆర్ఎస్ పుట్టిన తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైందని చెప్పారు.