ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం.
అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి.
జిల్లా ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్.
స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వేసవి కాలం సెలవులు ప్రారంభం అయినవి పెళ్లి ముహుర్తాలు మరియు స్నేహితులతో మరియు ఫ్యామిలీ మెంబర్స్ తో అంతా టూర్ ప్లాన్ చేస్తూ ఉంటారు.ఇదే అదునుగా దొంగతనాలకు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని జిల్లా ప్రజలు కూడా ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.దొంగతనాల నియంత్రణ కోసం జిల్లా ప్రజలు ఈ దిగువ తెలియజేసిన నిబoధనలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించగలరు.
- ఇంటి బయట డాబాల పైన పడుకునేవారు మెడలో నగలని జాగ్రత్తగా పెట్టుకోండి మరియు ఇంటిలో బంగారు ఆభరణాలు ఉంచకండి.
- బసుల్లో ప్రయాణాలలో మీ బ్యాగ్ను మీ పైన ఉంచుకొని గట్టిగపట్టుకొని వెంట అంటిపెట్టుకోండి గుర్తు తెలియని వ్యక్తులు తిను బండరాలు కూల్డ్రింక్స్ లాంటివి ఇస్తే తినకండి తీసుకోకండి.
- మీరు ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత మేరకు ఇంటిలో విలువైన వస్తువులు, నగదు మరియు బంగారం ఆభరణాలు పెట్టకండి వాటిని బ్యాంకు లాకర్లో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం.
- బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ బీరువాలోని బట్టల క్రింద కానీ ఇంట్లో కానీ పెట్టి వెళ్లవద్దు.
- ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి గేటు బయట గొళ్ళెం పెట్టకండి.
- ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు తాళం కనపడకుండా కర్టెన్స్ వేయాలి.
- ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి.
- బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి.
- బయటకు వెళ్ళేపుడు ఇంట్లో మరియు బయట లైట్ వేసి ఉంచండి.
- పేపర్ బాయ్ మరియు పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పండి.
- నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే నియమించుకోండి.
- మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.
- ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి పక్క వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి.
- బయటకు వెళ్లేటప్పుడు వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్త. వీలైతే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిది.
- మీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది, భద్రత ఎక్కువగా ఉంటుంది.
- మీ ఇంటికి సీసీ కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని DVR రహస్య ప్రదేశాలలో
- భద్రపర్చుకోవాలి. మరియు మొబైల్ యాప్ ద్వారా సీసీకెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది.
- మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయకండి.
- మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి.