మిల్లర్లు లోడింగ్ అన్లోడింగ్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
మెదక్ ఆర్డీవో రమాదేవి
స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
శంకరంపేట (ఆర్) మండల కేంద్రంలో రైస్ మిల్ శాలిపేట అంజా పేట కొనుగోలు కేంద్రాల పరిశీలన.
మెదక్ ఆర్డీవో రమాదేవి
ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని మిల్లర్లు లోడింగ్ అన్లోడింగ్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని మెదక్ ఆర్డీవో రమాదేవి సూచించారు.
మంగళవారం జిల్లాలోని శంకరంపేట ఆర్ మండల కేంద్రంలో శాలిపేట అంజాపేట గుపహాడ్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ ఆర్ డి ఓ రమాదేవి సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని ధాన్యం కొనుగోళ్ల రిజిస్టర్ లను తనిఖీ చేసి ఓపీఎంఎస్ లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా? రైతులు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని ప్రతిరోజూ పరిశీలిస్తున్నారా? సకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారా? అలాగే కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం కుప్పల గురించి పలు వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలో వారు స్పందిస్తూ ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను ఓపీఎంఎస్ లో నమోదు చేస్తున్నామని కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని కూడా ప్రతిరోజూ పరిశీలించి కావాల్సిన తేమ శాతానికి రాగానే కాంటా పూర్తిచేసి మిల్లులకు తరలిస్తున్నామని కేంద్ర నిర్వాహకులు ఆర్డీవో రమాదేవికి వివరించారు.ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర నిర్వాహకులను హెచ్చరించారు.
తాలు లేకుండా సరిచూసుకోవాలని తేదీ రైతు పేరు ఫోన్ నంబర్ ధాన్యం కొనుగోళ్ళ పూర్తి వివరాలతో రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తిచేసి అదే రోజు సంబంధిత మిల్లులకు తరలించాలని కేంద్రాల్లో ఎక్కువ రోజుల వరకు నిల్వ చేయకూడదని కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు.
అంతకుముందు రైస్ మిల్లును సందర్శించి ధాన్యం లోడింగ్ అన్ లోడింగ్ స్టాక్ రిజిస్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు చేశారు.ఈ పర్యటనలో ఆర్డీవో వెంట తాసిల్దార్ మన్నన్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.