జిల్లా పోలీసు కార్యాలయం, మెదక్ జిల్లా.01.11.2023.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు కేడిలు సస్పెక్ట్ షీట్ రౌడీ షీటర్ వివరాలపై సమీక్షా సామావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు సజావుగా జరుపుటకుగాను మెదక్ జిల్లా లోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి రౌడీలు, కేడిలు సస్పెక్ట్ ల వివరాలని సిబ్బందిని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేయడం జరిగింది. పుట్టుకతో ఎవరు కూడా నేరస్తులు కారు వారు పెరిగిన పరిసరాలు కావచ్చు, పరిస్థితుల ప్రభావాల వలన వారు సస్పెక్ట్, కేడిలు, రౌడీ షీటర్ లుగా మారవచ్చు. కానీ మీ యొక్క మంచి ప్రవర్తన వలన తిరిగి మామూలు వ్యక్తులుగా మరే అవకాశం మీ చేతుల్లోనే ఉందని అన్నారు. ఎన్నికల వేల మీపై నిఘా మరింత ఎక్కువగా ఉంటుందని, ఎలాంటి గొడవలలో తల దూర్చకుండా సత్:ప్రవర్తన కలిగి ఉండాలని అనవసర గొడవలకు పోయి ఇబ్బందులకు గురి కాకూడదని ఈ సందర్భంగా హెచ్చరించారు.