స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:మంగళవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పైన
ఎంపిక చేయబడిన దేశంలోని వందమంది జిల్లా కలెక్టర్లకు, ఇంజనీరింగ్ అధికారులతో సుదీర్ఘంగా చర్చ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ నేషనల్ హైవే పై ఇంకా తీసుకోవలసిన భద్రతాచార్యులపై సూచించడం జరిగింది.రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా కలెక్టర్, ఎస్పి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించిన అంశాలను
పరిగణలోకి తీసుకొని ఇంజనీరింగ్ అధికారులు పాటించే విధంగా రాష్ట్ర మరియు జాతీయస్థాయిలో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తేపెద్ద ఎత్తున ప్రమాదాలు నివారించవచ్చు అని సూచించడం జరిగింది.