-నవంబర్ 14నుండి డిసెంబర్ 12 వరకు కార్తీక మాసం ఉత్సవాలు..
-ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్ నవంబర్ 01, మహానంది:
మహానంది క్షేత్రంలో నవంబర్ 14నుండి డిసెంబర్ 12 వరకు కార్తీక మాసోత్సవాలు నెల రోజుల పాటు వైభవంగా జరగనున్నాయని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి బుధవారం తెలిపారు.కార్తీక మాసం అంటే నది స్నానం,ఈశ్వరాభిషేకం అత్యంత ప్రధానం, అలా తీర్థము, క్షేత్రము కలఖలిసిన మహానందిలో కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి తరించండి అని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక మాసం ఏర్పాట్లపై ఆలయ ఈవో కాపు చంద్ర శేఖర్ రెడ్డి ఆయా సెక్షన్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈవో మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, అయా సెక్షన్ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసిన ఏర్పాట్లు అన్ని కార్తీక మాసం ముందస్తుగానే పూర్తి చేయాలని సూచించారు. కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, బహుళ ఏకాదశి లు ప్రభుత్వ సెలవు దినాలు, లలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కనుక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఏర్పాట్లను ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ ఈ సంవత్సరం కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు వచ్చాయని,చివరి సోమవారం నాడు లక్ష బిల్వార్చన,27వ తేదీ పౌర్ణమి రోజున జ్వాలా తోరణం, కోటి దీపోత్సవం కార్యక్రమాలు జరుగునని తెలిపారు. క్షేత్రంలో అన్ని కార్తీక సోమవారాల్లో సామూహిక అభిషేకాలు, కేదారేశ్వర నోములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.రాహు కేతు మండపం ప్రక్కన కేదారేశ్వర నోములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.పాలక మండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రం లో వున్న పురాతన భావి చరిత్ర తెలిసే విధంగా ఆధునీకరించి భక్తులు సందర్శించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. కార్తీక మాసం లో ఉత్తర గాలి గోపురం వైపుగా 20రూపాయల దర్శనం,ఉచిత దర్శనం భక్తులు ఆలయంలోనికి ప్రవేశించి దర్శనం అనంతరం ఉత్తర గాలి గోపురం వైపుగా బయటికి వస్తారు.పార్కింగ్ కోసం సోమవారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.కొత్తగా మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టి శివరాత్రి వరకు పూర్తి చేస్తాం అన్నారు. కార్తీక మాసంలో వచ్చే భక్తుల కోసం క్షేత్రంలో అన్ని సామాజిక వర్గాల అన్నదాన సత్రం లకు ఆలయ అధికారుల నుండి పాలక మండలి నుండి పూర్తి సహకారాలు అందిస్తామని అన్నారు.ఏజెన్సీ సిబ్బందికి కూడా వారం రోజులలో జీతాలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం అన్నారు.పారిశుద్ధ్య పనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. కార్తీక మాసంలో క్షేత్రానికి వచ్చే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి , స్వామి వారి కి అభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేసుకొని తీర్థ ప్రసాద స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున రావు, ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆలయ అధికారులు పాల్గొన్నారు.