రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల నియోజకవర్గం, వెల్స్పన్ ఫౌండేషన్ ఫర్ హెల్త్ అండ్ నాలెడ్జ్ మరియు పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ వారి సహకారం తో చేవెళ్ల మండలంలోని మల్లా రెడ్డి గూడ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ M. మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మల్లా రెడ్డి గూడ గ్రామ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం ఈ వైద్య శిబిరాన్నికి దాదాపు 192 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. 20 మంది ఆపరేషన్ కొరకు తేల్చారు. అందులో ఎక్కువ శాతం 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఉన్నట్టు వైద్య బృందం తెలిపింది ఎక్కువ సమస్యలు మోకాళ్ల నొప్పులు కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు ఈ మోకాల సమస్యలు ఉన్న వ్యక్తులకు పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత ఆపరేషన్ చేయిస్తామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఈ యొక్క కార్యక్రమాలలో వెల్స్పన్ ఫౌండేషన్ ఫర్ హెల్త్ అండ్ నాలెడ్జి GM సురేఖ మరియు ప్రాజెక్టు మేనేజర్ బి భద్రయ్య మరియు పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ డీజీఎం డాక్టర్ సుమన్ కుమార్, నీరజ ఇతర వైద్య బృందం పాల్గొన్నారు..