*పౌష్టిక ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం..*
— ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి..
_పౌష్టికాహారం తీసుకోవడంవల్లే గర్భిణీ,బాలింతలు, ఆరోగ్యంగా ఉంటారని శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్లో గల ఎస్జెఆర్ ఫంక్షన్ హాల్ నందు పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలమూరు మండల పరిధిలో గల గర్భిణులకు, బాలింతలకు కొత్తపేట ఐసిడిఎస్ సిడిపిఓ పి.శారద ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవానికి ఎమ్మెల్యే చిర్ల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషకాహార లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వివరించారు.పౌష్టికాహార మాసోత్సవాలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.అనంతరం అంగన్వాడి కార్యకర్తలు చిన్నారులకు ఏర్పాటుచేసిన దుస్తులు, వాకర్లు అందజేసి అన్నప్రాసవ కార్యక్రమం నిర్వహించారు.అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిండి వంటలను ఆయన పరిశీలించి,గర్భిణీ,బాలింతలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, పలు శాఖల అధికారులు,వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు,గర్భిణీ, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు._