పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి
-మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా నాయకులు నరసింహుడు మాదిగ
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 19, మహానంది:
పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా నాయకులు నరసింహుడు మాదిగ అన్నారు. మంగళవారం మహానంది మండలం గాజులపల్లె మెట్ట నాలుగు కూడలి రోడ్డు వద్ద ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా నాయకులు నరసింహుడు మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టకపోతే ఎంఎస్పి ,ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోనికి వస్తే వంద రోజులకే రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పొందుపరిచిన ఎస్సి రిజర్వేషన్ జనాభా దమాషా ప్రకారంగా వర్గీకరించడం జరుగుతుందని చెప్పారు. రిజర్వేషన్ విషయంలో నష్టపోతున్న మాదిగ,మాది ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇప్పటికీ 9 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ వర్గీకరణ అంశము పార్లమెంటులో ఇంతవరకు లేవనెత్తకుండా మాదిగలను మోసం చేసుకుంటూ వచ్చారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ మండల కన్వీనర్ వెంకటసుబ్బయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి సర్వయ్య మాదిగ, మండల యువసేన మాదిగ అధ్యక్షుడు బి .ఈశ్వరయ్య, మండల ఎంఆర్పిఎస్ నాయకులు గడ్డం నాగేశ్వరావు, విక్టర్, రవి క్రిష్ణ, గడ్డం సర్వన్న, నాగ. నరసింహుడు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.