సత్య భామగా అందరి హృదయాల్లో పదిలమైన సీనియర్ నటీమణి, రాజకీయ నాయకురాలు శ్రీమతి జమున(86) మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సంతాపం తెలిపారు.
తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి, తనదైన ముద్ర వేసుకుని, సినీ అభిమానులను మెప్పించిన నటిగా ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా
నిలిచిపోతారని అన్నారు. 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పనిచేసి విలక్షణమైన వ్యక్తిగా, రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందారన్నారు. సీనియర్ నటులు వరుసగా చనిపోతుండడం సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించారు. స్వర్గీయ శ్రీమతి జమున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు.