ఆయిజ: జోగులంబా గద్వాల జిల్లాలోని ఆయిజ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ క్రిష్ణ ఫంక్షన్ హల్ లో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్ర రెడ్డి,అల్లంపూర్ మాజీ శాసన సభ్యులు రావుల రవీంద్ర నాథ్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రరెడ్డి మాట్లాడుతూ… నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం గురించి మరియు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన పనులను పథకాలను అందరికీ తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మొత్తం మునుగోడు కాళ్ళ కింద ఉంచిందని తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఒక్క బిజెపి కార్యకర్త ఒక ఎమ్మెల్యే తో సమానంమునుగోడులో మంత్రులు మల్లారెడ్డి , శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జ్ గా ఉన్న గ్రామంలో బిజెపి పార్టీ మెజార్టీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఐక్యత, భద్రత ,సంస్కృతికి పనిచేస్తుంది. ధరణి పేరుతో లక్షల కోట్లు దండుకుంటున్నారు.. కెసిఆర్ కొడుకు, కూతురు క్రెషర్ బినామీ పేర్లతో లీజు తీసుకొని కోట్లు దోచుకుంటున్నారు..ఉద్యోగం ఇస్తానని చెప్పి ఉద్యోగులు మోసం చేసి కేసీఆర్ ఇంటిలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు 28 మంది ఉద్యోగాలు ఏలుతున్నారు. కరోనా సమయంలో 2.25 లక్షల మందికి ఉచితంగా డోసులు ఇవ్వడం జరిగిందికేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద 5లక్షలకు కార్పొరేట్ ఆసుపత్రి లో అందించేందుకు వీలు కల్పిస్తే ఇంతవరకు కార్డు ఇవ్వనేలేదు. ఉజ్వల పథకం కింద 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి,జిల్లా ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు డికె. స్నిగ్ద రెడ్డి, రవి ఎక్బోటే, జలగరి అశోక్, అసెంబ్లీ కన్వీనర్లు టి. రామాంజనేయులు, తిరుమల్ రెడ్డి తదితరులు ఉన్నారు.