అయ్యప్ప స్వాములకు ముస్లిం యువకుడు అన్నదానం.
చేవెళ్ల నవంబర్ 13: అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు ముస్లిం సోదరుడు భోజన వితరణ (భిక్ష) చేసి మతసామరస్యతను చాటుకున్నాడు. చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో ఆదివారం అదే గ్రామానికి చెందిన మహమ్మద్ వాజిద్ 41 రోజు మండల దీక్ష బూనిన అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి వారితోపాటు కలిసి భోజనం చేసి మతాలకతీతంగా ముస్లిం సోదరుడు అయ్యప్ప స్వామి పై తమ భక్తిని చాటుకున్నారు. ఐక్యతకు చిహ్నంగా నిలిచిన గురుస్వాములు, గ్రామస్తులు అభినందించి వారి కుటుంబం పై అయ్యప్ప దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు వితరణ చేశారు.