తినుబండారాలలో నకిలీ మీ కుటుంబం జాగ్రత్త
- మనుషులు తినే ప్రతీదాంట్లో నకిలీ దందా రాజ్యమేలుతోంది. తాగే పాల నుంచి అన్నీ కల్తీ అవతారం మెత్తాయి.ప్రాణం కంటే పైసలకు విలువ ఇచ్చే ఈరోజుల్లో మార్కెట్లో దొరికేవి తినగలిగేవే అయినా అవి నకిలీనా కాదా అనది ఒకటికి పదిసార్లు చూసుకోవాలి. వీలైనంత వరకూ మనం పండించుకునేవి అయితే మన కుటుంబానికి మంచిది..
వికారాబాద్ జిల్లా:
తాజాగా నకిలీ అల్లం కూడా మార్కెట్లోకి వస్తోంది. పొరపాటున గమనించకుండా కొంటే నష్టపోవాల్సిందే.
సరిగ్గా అల్లంలా కనిపించే అటువంటి మూలికను వ్యాపారులు ఇప్పుడు ఎక్కువ లాభం కోసం మార్కెట్లో విక్రయించడం పెద్ద ఎత్తున మొదలుపెట్టారు . అల్లం చౌకగా ఉంటుందని, ఇంట్లో అల్లం పేస్ట్ తయారు చేసుకోలేమని పొరపాటున కొంటె మీ కుటుంబం ఆరోగ్యం అంతే తాజాగా వికారాబాద్ జిల్లాలో స్పెషల్ పోలీసులు జరిపిన దాడుల్లో ఊహించని విధంగా నకిలీ కెమికల్ అల్లం పెద్ద ఎత్తున పట్టుబడింది.