పరిసరాల పరిశుభ్రతతోనే అంటువ్యాధుల నివారణ సాధ్యం….. ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ బేబీశ్వర్ రెడ్డి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు కళాశాల ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా క్యాంపెనింగ్ ప్రోగ్రామ్ ను కళాశాల ప్రిన్సిపల్ కె.బేబీశ్వర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.బేబీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ యాబైమంది ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు రైల్వే స్టేషన్,బస్ స్టేషన్,గ్రామ వీధులలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి శుభ్రపరచడం జరిగిందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతోనే అంటు వ్యాధుల నివారణ సాధ్యమని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి పరిశుభ్రత కోసం చెట్ల నాటడం వంటి వాటిపై ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. విద్యార్థులు సేకరించిన ప్లాస్టిక్, వ్యర్థాలను గ్రామపంచాయతీ అధికారులకు అందజేయడమైనదిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ వి.శ్యామల, అధ్యాపకులు రెడ్డి ప్రతాప్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.