మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని లింగాయ పల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు ఉరిమిన సమయంలో పిడుగు పడి దోమ మొగులయ్య ఎద్దు మరణించింది. యజమానికి కాడేందు చనిపోవడంతో వ్యవసాయం ఎలా చేయాలని బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు. నా ఎద్దు యొక్క విలువ 50 వేల రూపాయలు ఉంటుందని తెలిపాడు. ప్రభుత్వం నాపై దయ ఉంచి ఆదుకోవాలని వేడుకున్నాడు.