స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ రేగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా రక్త పరీక్ష కేంద్రం మందులు నిల్వ చేయు స్టోర్ రూమ్ ఓపి రిజిస్టర్ సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించి వైద్యాధికారికి వైద్య సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలో ఎండ వేడిమి కారణంగా వడదెబ్బ తగిలి ఆస్పత్రికి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు.ఆశా కార్యకర్తలతో కలెక్టర్ పలు సూచనలు వేస్తూ ఎండ వేడిమికి వడదెబ్బలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వడ దెబ్బలు ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు.
వడదెబ్బ తగిలిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని ఆదేశించారు.
ప్రజలు తగినన్ని మంచినీరు తీసుకోవాలని ఎండలకు ఎంతో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని ముఖ్యంగా ఉపాధి హామీ పథకం పనిచేసే కూలీలు పనిచేసే ప్రాంతంలో త్రాగునీరు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఉపాధి హామీ పని వేళలు ఉదయం 06.00 గంటల నుండి11 గంటల వరకు ముగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
