జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
అప్పీల్ చేసిన ప్రతీ ఒక్కరికీ భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టం ప్రకారం పక్కాగా న్యాయం
భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూ భారతి నూతన ఆర్వోఆర్ – 2025 చట్టం అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి – చట్టం 25, అవగాహన సదస్సు మంగళవారం శంకరంపేట (A) మండల కేంద్రంలో రైతువేదిక లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్డిఓ రమాదేవి మండల ప్రత్యేక అధికారి ఆర్ అండ్ బి ఈ సర్దార్ సింగ్ స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో విటల్ రెడ్డి సంబంధిత రైతులుతో కలిసి కలెక్టర్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశం రైతులకు భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవహన కల్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టం అని ప్రతి భూ సమస్య సులభంగా పరిష్కారం కోసం ఈ పోర్టల్ చాలా ఉపయోగ పడుతుందని గతంలో చిన్న చిన్న భూవిషయాలు సమస్యలు పరిష్కారం తమ పరిధిలో లేక అనేక ఇబ్బందులు ఏర్పడేవన్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలకు రైతులకు అందుబాటులో భూ సమస్యలు పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచించారు జారీ చేయడం జరిగిందని రైతు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి అధికారులకు కేటాయించిన సమయంలో రైతుల దరఖాస్తు కు సమాధానాలు పరిష్కారం చూపే విధంగా ఈ కొత్తచట్టం ఉంటుందని అన్నారు.పూర్తిగా న్యాయమైన భూ సమస్యలను ప్రభుత్వం సూచించిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రకారం పరిష్కారం చేయుటకు పూర్తి అధికారాలు గ్రామ అధికారి తహసిల్దార్ రెవిన్యూ డివిజనల్ అధికారి కలెక్టర్ స్థాయి లలో ఇప్పుడు వర్తిస్తుందని రైతులు ఎలాంటి భూ సమస్యలకైనా అప్పీల్ ద్వారా హక్కును పొంది స్వేచ్ఛ రైతులకు ప్రజలకు ఉంటుందని అన్నారు. గత ధరణి పోర్టల్ ద్వారా సామాన్య రైతులకు రెవెన్యూ అధికారులు న్యాయం చెయ్యలేక పోయారని ప్రతి చిన్న విషయానికి సివిల్ కోర్టులకు వెళ్ళే వారని కొందరు రైతులు కోర్టుకు వెళ్లే అంత ఆర్థిక స్తోమత లేకపోయేసరికి భూ సమస్యలను అలానే వదిలివేసారని గుర్తుకు చేశారు.ప్రస్తుత ప్రభుత్వం
క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గొప్ప వేదిక కల్పించిందని (జీపిఓ) గ్రామ స్థాయిలో ఒక్క అధికారిని నియమించి వారస్వతం ఏజెన్సీ భూ హద్దులు తదితర అంశాలపై వారికి నిర్దేశించిన సమయంలో కచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఈ భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టం పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!