స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య అవగాహన సదస్సును ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్ర కుమార్ పర్యవేక్షన లో ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీతాదేవి డాక్టర్ శివదయాళ్ హాజరు అయ్యారు.ఇ కార్యక్రమాన్నీ ఫిజియాలజీ డిపార్ట్‌మెంట్ డాక్టర్ శాంత కుమారి మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమంత్ నిర్వహించారు.
మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎటువంటి ఆరోగ్యకర పదార్ధాలు తినాలి
మన జీవన విదానంలో మానసిక ఒత్తిడి కల్గినపుడు దాని నుండి ఎలా బయట పడాలి ఉదయం లేవగానే బ్రష్ చేసే విధానం మరియు నడక యోగ ప్రాణాయామం ప్రార్ధన సూర్యనమస్కారాలు వంటి ఎన్నో విషయాలను M.B.b.S.విద్యార్ధులు bsc నర్సింగ్ విద్యార్ధులు DMLT మరియు DANS విద్యార్ధులు వివరణ ఇచ్చారు.ఏదైన సందర్భం లో మన పక్కవారికి గుండె పోటు వస్తే వారిని ఎలా రక్షించాలి అని CPR విదానం గురించి తెలియజేసారు.మన కండర లు ఆలసిపోయినపుడు వాటికి ఎట్వంటీ వ్యయమం అవసరం అని తేలిపారు.ఈ కార్యక్రమంలో మన దైనందిన జీవితంలో ఉపయోగపడే అనేక విషయాల గురించి వివరణ ఇచ్చాడు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జయ తధితరులు పాల్గొన్నారు.
