స్టూడియో10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర్ రాజనర్సింహ చేసిన కృషి ఫలితమే మారుమూల మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడానికి కారణమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
సోమవారం టేక్మాల్ మండలం ఎల్లుపేటగ్రామంలోనూతనంగా ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఆరోగ్య కేంద్రంలో కలియతిరిగి వైద్య సేవలు వసతులు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య పరంగా విద్యాపరంగా జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సలహాలు సూచనలు మార్గదర్శికంగా పనిచేస్తున్నాయని తద్వారా వైద్య సేవలు విస్తృతం పరిచి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఆందోల్ కాన్స్టెన్సీ అల్లాదుర్గ్ రేగోడు చాలా వెనుకబడిన ప్రాంతాలుగా ఉంటాయని నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలు నివసిస్తున్నారని ఇంతకుముందు వైద్య సేవలు పొందడానికి సదూర ప్రాంతాలకు వెళ్లి ప్రజలు ఇబ్బంది పడే వారిని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని 20వేల జనాభా ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసుకోవడం ప్రజలకు వైద్య సేవలు ఎంతో మెరుగుపడతాయి అన్నారు.
సబ్ సెంటర్ ను అప్ గ్రేడ్ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
ప్రస్తుతం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనిచేస్తుందని రాబోవు రోజుల్లో 24 గంటలు పనిచేసే ఆరోగ్య కేంద్రం వస్తుందన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటైన మొదటి రోజే పూర్తిస్థాయిలో సిబ్బంది నియమించడం మౌలిక వసతులు కల్పించడం పట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ సేవలను కలెక్టర్ కొనియాడారు.ఆరోగ్య కేంద్రాన్ని సక్సెస్ గా రన్ చేయడానికి బాధ్యతగా తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మెడికల్ సిబ్బందిని ఆదేశించారు.
మన జిల్లాకు వైద్య ఆరోగ్యశాఖ పరంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నదని రాష్ట్రం మొత్తంలో మన జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గణనీయమైన వైద్య సేవలు వైద్య సిబ్బంది సమయపాలనలో ఆదర్శంగా నిలుస్తారన్నారు.
మొత్తం రాష్ట్రంలోనే సంచలన సృష్టించే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రూపుదిద్దుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు కృషి ఎంతో ఉన్నదని చెప్పారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ వైద్యాధికారులు సిబ్బంది బయటకు వెళ్ళినప్పుడు మూమెంట్ రిజిస్టర్ ద్వారా తెలియపరిచేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.వైద్య ఆరోగ్యశాఖలో సమూలమైన మార్పులు మన జిల్లా నుంచి ప్రారంభం కావడం దీనికి ప్రత్యేకంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగాన్ని మార్గదర్శికంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సూచనలు సలహాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని కలెక్టర్ చెప్పారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ లు సృజన అనిలా హరి ప్రసాద్ వైద్యాధికారిని హర్షిత సంబంధిత వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
