పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో
హవేలి ఘనపూర్ మండలం కుచానపల్లి, గజిరెడ్డిపల్లి బూరుగుపల్లి కొనుగోలు కేంద్రాల పరిశీలనలో అదనపు కలెక్టర్ నగేష్
స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
హవేలీ ఘన్పూర్ మండలంలో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.సోమవారం హవేలీ ఘన్పూర్ మండలంలో అదనపు కలెక్టర్ నగేష్ బూరుగుపల్లి గజిరెడ్డిపల్లి కుచాన్పల్లి విస్తృతంగా పర్యటించి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.రీజిస్టర్లు పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హవేలీ ఘన్పూర్ మండలంలో కుచాన్పల్లి ఐకెపి కొనుగోలు కేంద్రం బూరుగుపల్లి గజిరెడ్డిపల్లి కొనుగోలు కేంద్రాలను పరిశీలన చేయగా సమర్థవంతంగా కొనుగోలు జరుగుతున్నట్లు నిర్వాహకుల ద్వారా తెలుసుకొని
ధాన్యం కొనుగోలు లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని జాగ్రత్తగా తడవకుండా కింద పైన టార్పలిన్ కప్పాలని నిర్వాహకులకు సూచించారు. లారీల కొరత లేకుండా చూసుకోవాలనిఆదేశించారు. .కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన తరలించాలని అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు.రైస్ మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.