మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి.
స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎమ్మెల్యే రోహిత్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
సిద్ధాంతపరంగా విమర్శలు చేసుకోవాలి కానీ ఇది సమంజసం కాదు.
ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మైనాంపల్లి రోహిత్ రావు వ్యాఖ్యలు
మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉండాలి.కానీ అతని వ్యాఖ్యలు దిగజార్చి విధంగా ఉన్నాయి..
ఈ నెల 17న మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతని కేసు నమోదు చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ఎమ్మెల్సి శేరీ సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ కంఠరెడ్డి తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డినీ కలిసి పిర్యాదు చేశారు.
అనంతరం బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించరు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉండాలీ కాని దిగజర్చే విధంగా ఉండొద్దన్నారు.14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసే విధంగా కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలు చేసి ఎమ్మెల్యేనే అలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. సమాజానికి ఏమి మెసేజ్ పంపుతున్నారని ధ్వజమెత్తారు.పద్ధతి మార్చుకొని మెదక్ ను అభివృద్ధి చేయాలని కోరారు.మెదక్ నియోజకవర్గన్నీ అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారనీ వాటిని నెరవేర్చి మెదక్ ను అభివృద్ధి పథంలో నడిపించాలనీ డిమాండ్ చేశారు.అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు.ఎన్నికల సందర్భంగా రకరకాల హామీలు ఇచ్చి కుట్రపూరితంగా మాట్లాడి ఇక్కడ ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇక్కడి ప్రజలను మోసం చేశారన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రామయంపేటలో బిఅర్ఎస్ పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేస్తే ఇది మా పరిధిలోకి రాదంటూ ఆ ఫిర్యాదును రిజెక్ట్ చేయడం జరిగింది అన్నారు.
అలాంటప్పుడు బిఅర్ఎస్ పార్టీ కార్యకర్త రవీందర్ రెడ్డి నీ పోలీసు స్టేషన్ తీసుకువచ్చి కొట్టి అతని ఫోన్ సీజ్ చేశారు ఇది ఎక్కడి న్యాయం అన్నారు.
పోలీసులు ఈ కొట్టుడు సంస్కృతి ఏందన్నారు.తప్పు చేస్తే కేసునమోదు చేయాలన్నారు.కానీ పోలీసుల పనితీరు ప్రభుత్వానికి ఒక న్యాయం ప్రతిపక్షాలకు ఒక న్యాయంల ఉందన్నారు.
ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమే అన్నారు.కానీ పోలీసుల తీరు ప్రజాస్వామయుతంగా లేదన్నారు.పోలీసు చర్యల ద్వారా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయపడితే ఉపేక్షించేది లేదు అన్నారు.బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టీ కేసులు పెడితే మొదటగ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మీద కేసు నమోదైన తర్వాత మా కార్యకర్తలను ముట్టుకోవాలన్నారు. మొదట మాట్లాడింది ఎమ్మెల్యే అని గుర్తు చేశారు.అతనిపైన చర్యలు తీసుకున్న తర్వాతనే కార్యకర్తలకు పైన చర్యలు తీసుకోవాలన్నారు.
బిఆర్ఎస్ పార్టీకి జోలికి వస్తే ఊరుకునేది లేదు అన్నారు.
ఒక్కసారి కేసీఆర్ పిలిపిస్తే వేలాదిగా కార్యకర్తలు తరలివస్తారన్నారు.
మూడున్నర సంవత్సరాల పదవి కాలం ఉందని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వాళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వానికి ఒక న్యాయం ప్రతిపక్షాలకు ఒక న్యాయమని డిమాండ్ చేశారు.సిద్ధాంతపరంగా విమర్శలు చేసుకోవాలీ కాని ఇలా మాట్లాడటం సరికాదన్నారు.ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలామంది ట్రోల్ చేశారని వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదన్నారు.మంచినీళ్ల కోసం కరెంటుకోసం రైతు భరోసాకోసం రాక రైతుల అవస్థలు పడుతున్నారు వాళ్ల గురించి ఆలోచించాలన్నారు.
మెదక్ లో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో వాళ్ల సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక మెదక్ నియోజకవర్గ ప్రజలు అవస్థలు పడుతున్నారనీ తెలిపారు.అలాంటిది తెలంగాణ గుండెలో నిలిచిన వ్యక్తి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా మిమ్మల్ని ఇందుకేనా ఇక్కడ ప్రజలు గెలిపించింది విమర్శించారు.ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఏం లావణ్య రెడ్డి మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి నాయకులు కిష్టయ్య గౌస్ ప్రభు రెడ్డి మాజీ సర్పంచ్లు లింగం మేకల సాయిలు యామ్ రెడ్డి మైపాల్ రెడ్డి మోహన్ నాయక్ ఎలక్షన్ రెడ్డి గంజి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు