• అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు.
  • రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత.
    జిల్లా ఎస్పీ .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్.

స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:

  • రోడ్డు ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగల్చవద్దు.
  • జాతీయ రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు అనుమతి లేకుండా పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్.
    జిల్లా పోలీసు కార్యలయంలో జిల్లా ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపిఎస్ మాట్లాడుతూ కేవలం మానవ తప్పిదాలు నిర్లక్ష్యం అజాగ్రత్తవల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని అన్నారు.చాలామంది రోడ్డు ప్రమాదాల బారిన పడి అర్ధాంతరంగా చనిపోతున్నారని అన్నారు. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్ళే వారు జాగ్రత్తగా వెళ్ళాలని సూచించారు.ప్యాసింజర్ వాహనాలపై పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం అధికలోడు తో వాహనాలు నడపడం ప్రమాదకరం అన్నారు. రహదారులపై వాహనాలను ఎక్కడపడితే అక్కడ అనాతరైజ్డ్ పార్కింగ్ చేస్తే అలాంటి వాహనాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.అధిక లోడ్ వల్ల వాహనాలు కడిషన్ తప్పి డ్రైవర్ సరైన పద్దతిలో వాహనాన్ని నడపడం ఇబ్బంది అవుతుంది అన్నారు. జిల్లాలో నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నిభందనలు ఉల్లంఘించిన వారిపై జరిమాలు కేసులు నమోదు చేస్తున్నాము అని అన్నారు. వాహనదారులు కూడా బాధ్యతగా ఉంటూ నిభందనలు పాటించాలని అన్నారు రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని కోరారు.మద్యం సేవించి వాహనాలు నడపవద్దు హెల్మెట్ ధరించాలి సీటు బెల్ట్ విధిగా పెట్టుకోవాలి అధికవేగంతో వాహనం నడపవద్దు వాహన సామర్ధ్యానికి మించి రవాణా చేయవద్దు, రాంగ్ పార్కింగ్ రాంగ్ రూట్ ప్రయాణం చేయవద్దు ట్రిపుల్ రైడింగ్ బైక్ రేసింగ్ చేయవద్దు.అజాగ్రత్తతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబాలకు దుఃఖం మిగల్చవద్దు అని ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!