స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
- ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి
- ద్వాక్రాగ్రూప్ క్రింద 82 వేల రూపాయల చెక్కు అందజేత
- మెదక్ పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
- ఎస్సి కార్పోరేషన్ క్రింద మహిళాలబ్ధిదారులకు కుట్టుమిషన్ ల అందజేత
- ప్రజాశ్రేయస్సు కొరకు నిరంతరం మీతో ఉంటా
- మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సిఎంఆర్ఎఫ్ పథకంతో పేదోళ్ళు దైర్యంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉందని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్ పట్టణంకు చెందిన ఇరవై మంది లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కొరకు నిరంతరం ప్రజలతో ఉంటానని ఆయన అన్నారు.అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పథకం పేదోళ్ళు కడుపునిండ అన్నం తినాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ధృడనిర్ణయం తీసుకుందని ఆయన గుర్తుచేశారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సి కార్పోరేషన్ క్రింద కుట్టుమిషన్ శిక్షణ పొందిన మహిళా లబ్దిదారులకు సర్టిఫికేట్ లతో పాటు కుట్టుమిషన్ లను అందజేశారు.అనంతరం మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా తో పాటు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ లో ద్వాక్ర గ్రూప్ క్రింద ఇటీవల మ్యాకల సరోజన మృతి చెందగా వారి భర్త. మ్యాకల రవీందర్ కు 82 వేల రూపాయల చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తదితరులు పాల్గోన్నారు.