రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 28:-మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు కర్రే రమేష్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అమ్మలాంటి బిఆర్ఎస్ పార్టీని ప్రాణం పోయే వరకు వీడేది లేదని పార్టీని విడిపోయేవారు నమ్మకద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.అమ్మలాంటి పార్టీని వీడిపోయిన వారికి పట్టగతులు ఉండవన్నారు.ఎవరు పోయినా ఉండినా పార్టీకి నష్టం లేదని కొన్ని రోజుల్లోనే కెసిఆర్ సారధ్యంలో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. జీవితాలకు అధికారాన్ని కట్టబెట్టి పేరు ప్రఖ్యాతలు అందించిన పార్టీని వీడిపోతున్నవారు నమ్మకద్రోహులని ఆయన విమర్శించారు.ఉన్నన్ని రోజులు అధికారాలు అనుభవించి కొన్ని అనుకోని సంఘటనల వల్ల అధికారం కోల్పోయిన తల్లిలాంటి పార్టీని వెంట ఉండి కాపాడుకోవాల్సిన సమయములో పార్టీని వీడి పోవడం దారుణమని ఆయన తెలిపారు.ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించిన పార్టీ నాయకుడు కెసిఆర్ అడుగుజాడల్లోనే నడుస్తామన్నారు. ప్రజల కోసం పదేళ్లుగా పనిచేసిన బిఆర్ఎస్ పార్టీలో తాము ఎల్లప్పుడూ కొనసాగుతామని మళ్లీ అధికారంలో తెచ్చే వరకు పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.