రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 28:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నిట్టేసిందన్నారు. దీనికి కారణం ఎమ్మెల్యే హరీష్ రావు మరి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో హరీష్ రావు గారు మెదక్ నుండి పోటీ చేయకుండా ఒక డబ్బున్న వ్యక్తిని తెర ముందుకు తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేయించడం జరిగిందన్నారు.మంత్రి హరీష్ రావు గారికి సూటి ప్రశ్న ఏమిటంటే మీరు ఎందుకు డబ్బులకు కక్కుర్తి పడి మెదక్ ఎంపీగా ఒక ఎవరు గుర్తుపట్టని వ్యక్తిని తీసుకువచ్చి ఎంపీగా పోటీ చేయించారన్నారు. మీరు ఎందుకు స్వయంగా ఎందుకు పోటీ చేయలేదన్నారు.మీరు బిజెపితో కుమ్మక్కై డబ్బులకు ఆశపడి ఈ విధంగా పోటీ నుంచి తప్పుకున్నారు.మరి సికింద్రాబాద్లో చూస్తే పద్మారావును ఎందుకు పోటీ చేయించారు. మరి మీరు ఎందుకు మెదక్ నుండి పోటీ చేయలేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. దీన్ని బట్టి చూస్తే మీరు బిజెపితో చేతులు కలిపి పరోక్షంగా బిజెపి అభ్యర్థి గెలిచే విధంగా పనిచేశారని మేము ఆరోపణ చేస్తున్నాము. మీరు దీనికి ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము.అలాగే ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు మొత్తం మెదక్ ఎంపీ నియోజకవర్గాలు ఏడులో ఒక్క మెదక్ ఎమ్మెల్యే గా రోహిత్ రావు గారు ఉన్నారు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇచ్చి మెదక్ అభివృద్ధిని శరవేగంగా నడిపించాలని కోరుతున్నాము. ఇప్పుడు బిఆర్ఎస్ పరిస్థితి ఓడిపోయిన రేసుగుర్రంలా మారిందన్నారు.చనిపోయే ముందు వ్యక్తిని వెంటిలేషన్ పైన ఎలా ఉంచుతారో అలాంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి ఈరోజు నెలకొందన్నారు. కావున మా డైనమిక్ యువ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వాలని. మరియు బిసి ముద్దు బిడ్డా నీలం మదు ముదిరాజ్ కు మంత్రి పదవి ఇచ్చి మెదక్ నియోజకవర్గ అభివృద్ధి చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నామని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గం ప్రెసిడెంట్ సేవాదళ్ జహీరుద్దీన్ కొనాపూర్ సొసైటీ డైరెక్టర్ సిద్ధిరాములు కాట్రియాల తావుర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.