రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 28:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో డీఈవో దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.గత ప్రభుత్వాలలో ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవే సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. పేద, మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నరని, పరిస్థితులకు భయపడి వారి తల్లి దండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చది వించడానికి మొగ్గు చూపుతున్నారన్నారు.దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలు కళాశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్య క్తం చేశారు. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రి నియామకం చేసి గత ప్రభుత్వాల తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో సంపత్ భాను అఖిల్ అక్షయ్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.