Reporter -Silver Rajesh Medak.
తేదీ 28-6-2024
మెదక్ జిల్లా
ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి.
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి.
వైద్యాధికారుల సేవల గురించి రోగులతో ఆరా.
పశువైద్యాధికారులు సమయపాలన పాటించాలి జిల్లాకలెక్టర్ రాహుల్ రాజ్.
జిల్లాలో ధరణి లో పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
గురువారం వెల్దుర్తి మండల తాహాసిల్దార్ కార్యాలయాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పశు వైద్య కేంద్రంలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ధరణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు తగు సూచనలు, సలహాలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి వారం రోజుల్లో
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.
ఆ మేరకు మండల తహసిల్దార్లు రోజువారీగా విభజించుకొని పరిష్కారం చేయాలని ఆదేశించారు. అదనపు సమయం కేటాయించి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో 100 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటి పరిష్కార దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలిస్తూ ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని మందుల కొరత లేకుండా చూడాలన్నారు.
వైద్యాధికారులు ఎలా చూస్తున్నారు ఏ విధమైన మందులు ఇస్తున్నారు ఎలా సమయపాలన పాటిస్తున్నారు సదుపాయాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులు మందులను పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రం ను పరిశీలిస్తూ పశువులు రోగాల బారిన పడకుండా కాపాడాలని పశువైద్యాధికారులు సమయపాలన పాటించాలన్నారు. ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో పలు రకాల మందులను పరిశీలించారు. పశువైద్యాధికారుల హాజర నమోదును పలు రికార్డులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ తులసి రామ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.