రామాయంపేట మండలంలో అవినీతికి కేరాఫ్ గా మిషన్ కాకతీయ పనులు

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 23:- కాకతీయ నిజాం రాజులు ముఖ్యంగా చెరువుల తవ్వకాలు నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అనేక చెరువులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అద్భుత గొలుసు కట్టు నిర్మాణంతో గ్రామాల ప్రజలకు సాగునీరు సౌకర్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.వర్షాభావ ప్రభావం ఎక్కువ లేక ఎలాంటి కాలువలు నదులకు రామాయంపేట ఉమ్మడి మండల ప్రాంతం వర్షం మీద ఆధారపడి ఆరో కోర పంటలతో బతుకు గడుపుతున్న చిత్రం .కనీసం సాగునీరు లేకున్నా చెరువులు పుష్కలంగా ఉంటే ఒక పంటతో తన తిండి గింజలు తిని సమాజానికి అందించగలరు. కానీ మెదక్ జిల్లా రామాయంపేట మండల ప్రాంతామే కాకుండా పట్టణ ప్రాంతం కూడా ఎలాంటి కాలువలు పరిస్థితి లేకపోవడం విచారకరం. స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి అప్పటి ఎమ్మెల్యే నుండి రామాయంపేట పట్టణానికి కాలువలు అందించడానికి ప్రణాళికలు వేసిన మెదక్ ఖిల్లా కన్న ఎంతో ఎత్తులో ఉన్న రామాయంపేటకు సాగునీరు తేవడం రావడం జరగని పని అని తెలిసింది.అందుకే ఇక్కడి ప్రజలు రైతులు వర్షంపై లేకుంటే బోర్లపై ఆధారపడి ఆర్థికంగా అప్పుల పాలవడం కరెంటు షాకులకు గురవడం పురుగుల మందు తాగడం జరిగిన వాస్తవాలు.మిషన్ కాకతీయ పథకం ద్వారా మంచి దశ వస్తుందనుకుంటే టిఅర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులకు రాజకీయ నిరుద్యోగులకు వరంగా మారిందని పరిశీలకులు అంటున్నారు.ఉమ్మడి మండలంలో రామాయంపేట మండలంలో కూడా కోటి నుండి 15 లక్షల వరకు మిషన్ కాకతీయ మంజూరు పైనుండి ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఈఈ వరకు పనుల పర్యవేక్షణ తూతూ మంత్రంగా జరిగింది. ఒకటి నుండి నాలుగు పేసుల్లో రామాయంపేట మండలంలో 115 చెరువులకు 16 కోట్ల 69 లక్షలు మంజూరు జరిగాయి.కనీసం 30 శాతం చెరువులకు ఏమైనా పనులు జరగలేదని పరిశీలకులు అంటున్నారు.మొత్తం కూడా కాంటాక్ట్ నాయకులు అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని పరిశోకులు అంటున్నారు.ఉమ్మడి నిజాంపేట మండలంలోని నస్కల్ చల్మెడలో మొత్తం చెరువులు టిఆర్ఎస్ నాయకుల కనుసన్నుల్లో అవినీతి జరిగిందని పరిశోధకులు అంటున్నారు. ఇరిగేషన్ జిల్లా అధికారులు నుండి స్థానిక ఏఇ
ఏడిల వరకు నాయకులకు లోబడి ఏకంగా బిల్లు సాంక్షన్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.ఇప్పటి కూడా కాకతీయ మిషన్ మరమ్మతు లేకపోవడం చెరువులకు కుంటలకు బుంగలు సొరలు సరి చేయడం జరుగుతుంది. అధికారులు మాత్రం మండల సర్వసభ్య సమావేశంలో చెరువుల మరమ్మతులు పూర్తి చేశామని చెప్పడం విశేషం ముఖ్యంగా రామాయంపేట మల్లెచెరువు మొదట మినీ ట్యాంక్బండ్ గా మారుస్తామని ఐదు కోట్లకు పైగా మంజూరు అయినట్లు ప్రకటించిన ప్రస్తుతం రెండు కోట్ల 60 లక్షలతో మరమ్మత్తులు చేపట్టామని మండల ఏఈ కుశాల్ తెలిపారు. కానీ ఇప్పటివరకు మరమ్మతులకు ఎలాంటి నిధులు లేవని ఆయన తెలిపారు. కానీ అక్కడ కోట్ల ఖర్చులు పనులు జరగలేదని గతంలో కూడా పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి అల్లాడి వెంకటేష్ అనేక సార్లు అధికారులకు ప్రభుత్వానికి వినతి చేసినా కాంట్రాక్టర్ అధికారులు తక్కువఖర్చుతో గజమెత్తు బార్కెట్లు నిర్మించారని కట్టపై కూడా ఇప్పటివరకు చదును చేయక కంకరని అలాగే కొనసాగుతున్నదనిఅప్పటి అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. మల్లె చెరువుతో పాటు మండలంలోని గత మిషన్ కాకతీయ చెరువులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!