1981-82బ్యాచ్ 7వ అపూర్వ కలయిక

చేవెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981-82 చదివిన నాటి విద్యార్థులు ఆదివారం ఓ ఫామ్ హౌస్ లో 7వ ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించుకున్నారు. ఈ అపూర్వ కలయిక కార్యక్రమంలో 45 మంది పూర్వ విద్యార్థులు హాజరై తమ చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు ఆటపాటలతో హోరెత్తించారు. తమ బ్యాచ్ ద్వారా ఇప్పటివరకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టామని, ఇకముందు చేపట్టబోయే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి సేవా కార్యక్రమాలపై పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో 1981-82 బ్యాచ్ గౌరవాధ్యక్షులు మల్గారి రమణారెడ్డి, అధ్యక్షులు రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి పెంటయ్య, సంయుక్త కార్యదర్శి జి.సత్యనారాయణ గౌడ్ మరియు భాగ్యలక్ష్మి, భారతి, ఇందిర, మందుముల ప్రభు, మాణిక్యరెడ్డి, భోజిరెడ్డి, సురేందర్ రెడ్డి, శంషోద్దీన్, విత్తల్ రెడ్డి, బుచ్చిరాములు, సుధాకర్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!