టి జి ఎస్పీ డి సి ఎల్ 11కెవి ఫీడర్ల ను మొబైల్ అప్ ద్వారా సర్వే .

టి జి ఎస్పీ డి సి ఎల్ 11కెవి ఫీడర్ల ను మొబైల్ అప్ ద్వారా సర్వే .

మెదక్ (స్టూడియో 10 టీవీ ప్రతినిధి)

దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ(టి జి ఎస్పీ డి సి ఎల్) సమగ్ర నెటవర్క్ సర్వే కొరకు మరో మొబైల్ అప్ ( TGAIMS ) రూపొందించింది . ట్రాన్సఫార్మర్లు , ఉన్న విద్యుత్ తీగలు పరికరాలు ఇలా ప్రతిదీ ఏ దశలో ఉంది , ఎలా పనిచేస్తుంది అనే వివరాలను ఈ ఆప్ ద్వారా రికార్డు చేయబోతున్నారు. శనివారం నాడు టి జి ఎస్పీ డి సి ఎల్, మెదక్ ఎస్ ఈ జానకి రాములు గారు తన బృందంతో మెదక్ పట్టణములో ప్రయేగాత్మకంగా నమోదు ప్రక్రియ చేపట్టారు. సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభిస్తునట్లు మెదక్ ఎస్ ఈ గారు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశలో విద్యుత్ లైన్లు సర్వే పనులను మెదక్ టౌన్ పరిధిలో ఉన్న 10 ఫీడర్లు ను , మూడు బృందాలుగా ఏర్పడి మొబైల్ అప్ ( TGAIMS ) ద్వారా జి పి ఎస్ తో అనుసంధానం చేస్తారు అని తెలిపారు. ఏ ఈ,సిబ్బంది ఒక బృందంగా మరియు సబ్ ఇంజనీర్ ,సిబ్బంది మరో బృందంగా క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై సర్వే చేయనున్నారన్నారు . ప్రస్తుతం విద్యు త్ నెటవర్క్ మ్యానువల్ గా కొనసాగుతుంది ఎక్కడైనా సమస్య వస్తే సిబ్బంది వారికున్న పరిజ్ఞానం ఆధారంగా ఫలానా సమస్య అయిఉండవచ్చని భావించి అక్కడికి వెళ్లి మరమ్మతులు చేస్తారు . ఈ ఆప్ ద్వారా పూర్తి సమాచారం చేతి లో ఉంటే ,దాని బట్టి ప్రాధాన్యల వారీగా నిర్వహణ ప్రణాళికలు రూపొందించుకొనేందుకు సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఈ అప్ దోహదం చేస్తుంది అని ఎస్ ఈ గారు తెలిపారు .

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!